తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలిపులి తన పంజా విసురుతోంది. రాజధాని హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా భారీగా పడిపోయాయి. దీని ఫలితంగా రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు.
...