కాకినాడ పోర్ట్ ను తన చేతుల్లోకి లాక్కోడానికి జగన్ ఎందుకు ఇంత దౌర్జన్యం చేశారని ఆరోపించారు మంత్రి నాదెండ్ల మనోహర్. విజయవాడలో మీడియాతో మాట్లాడిన నాదెండ్ల... కేవీ రావు కుటుంబాన్ని జగన్ ఎందుకు హింసించాడు? చెప్పాలన్నారు. దేశ కార్పొరేట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బలవంతంగా 41% షేర్లను అరబిందోకి కట్టబెట్టారు...దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు.
...