తెలంగాణలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 45 మంది ఉమ్రా యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను తెలంగాణ హజ్ కమిటీ అధికారిక ప్రకటనలో నిర్ధారించింది. పవిత్రమైన ఉమ్రా యాత్ర ముగించుకుని మదీనాకు వెళ్తున్న ఈ యాత్రికుల ప్రయాణం అకస్మాత్తుగా విషాదంగా మారింది.
...