హైదరాబాద్ నగరమే మన ఆదాయం... ఆత్మగౌరవం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నాం... ఆ ప్రణాళికల ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ రైజింగ్ ఉత్సవాలు హెచ్‌ఎండీఏ మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపన చేశారు రేవంత్ రెడ్డి.
...