భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సర్కిల్‌లో పోలీసులను విషాదాలు వెంటాడుతున్నాయి. అశ్వారావుపేట ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్య ఘటనను మరువకముందే..మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. దమ్మపేట పోలీస్ స్టేషన్ లో రెండవ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న సీమా(60) బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.
...