భారత్‌లో 5జీ టెక్నాలజీని అత్యంత వేగంగా అందుబాటులోకి తీసుకురావడానికి భారతీ ఎయిర్‌టెల్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను (5G networks in India) విస్తరించడం కోసం దిగ్గజ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టీసీఎస్)తో (Bharti Airtel-TCS Collaboration) జతకట్టనుంది.
...