కేంద్ర ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) సబ్‌స్క్రైబర్ల పునాది క్రమంగా పెరుగుతున్నదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ పరిధిలో 4జీ (BSNL 4G) సేవలు అందుబాటులో ఉన్నాయని, దాన్ని 5జీ లోకి కన్వర్ట్ చేసే ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర టెలికం శాఖ మంత్రి సింధియా శనివారం మీడియాతో చెప్పారు.
...