ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మీ (Redmi) తన రెడ్‌మీ 14సీ 5జీ (Redmi 14C 5G) ఫోన్‌ను భారత్ తోపాటు సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. 2025 జనవరి ఆరో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. రెడ్‌మీ 14 ఆర్ 5జీ ఫోన్‌ను పోలి ఉండే రెడ్‌మీ 14సీ 5జీ (Redmi 14C 5G) ఫోన్‌లో లార్జ్, సెంటర్డ్ సర్క్యులర్ రేర్ కమెరా మాడ్యూల్ ఉంటుంది.
...