శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ భారత్ ఆపరేషన్స్‌కు చెందిన 200 మందికి పైగా ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వ్యాపార వృద్ధి మందగించడం, వ్యయ నియంత్రణ, డిమాండ్ లేమి వంటి కారణాలతో ఉద్యోగులను కుదించాలని కంపెనీ నిర్ణయించినట్లు సమాచారం.
...