2026 ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా ఖగోళ ప్రేమికులు ఎదురుచూస్తున్న సంపూర్ణ సూర్యగ్రహణం (Total Solar Eclipse) సంభవించనుంది. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేయడంతో కొద్ది నిమిషాల పాటు పగటిపూట చీకటి అలుముకుంటుంది. ఈ సంపూర్ణ గ్రహణం ప్రధానంగా గ్రీన్‌ల్యాండ్, ఐస్‌లాండ్, స్పెయిన్‌లోని కొన్ని ప్రాంతాలు సహా ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో స్పష్టంగా కనిపించనుంది.
...