చైనాలో విజృంభిస్తున్న హెచ్‌ఎంపీవీ వైరస్‌పై ఆ దేశం స్పందించింది. వ్యాప్తిని తక్కువ చేసే ప్రయత్నం చేసింది. ఈ వైరస్ కారణంగా ఆస్పత్రుల్లో రద్దీ పెరిగిందని వస్తోన్న నివేదికలను తోసిపుచ్చింది. శీతాకాలంలో వచ్చే ఈ శ్వాసకోశ వ్యాధుల తీవ్రత గత ఏడాదితో పోలిస్తే తక్కువగానే ఉందని పేర్కొంది. విదేశీయులు తమ దేశం (China)లో పర్యటించడం సురక్షితమేనని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది.
...