ఉత్తరకొరియాలో కొద్దిరోజుల కిత్రం ఒమిక్రాన్ మొదటి కేసు నమోదు కాగా తాజాగా భారీ సంఖ‍్యలో పాజిటివ్ కేసులు (COVID Hits North Korea) పెరగడం నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, ఇప్పటివరకు వరకు నార్త్ కొరియాలో కరోనా వైరస్‌తో 42 మంది మృతి చెందినట్టు ఆ దేశ మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(KCNA) ఓ ప్రకటనలో తెలిపింది.
...