చైనా వూహాన్ ల్యాబ్ నుంచి లీకయినట్లుగా భావిస్తున్న కరోనావైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి విధ్వంసం సృష్టించిందో మనమందరం చూశాం. తాజాగా అదే తరహాలో ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ పబ్లిక్ హెల్త్ వైరాలజీ ల్యాబ్ నుంచి ప్రమాదకరమైన వందలాది వైరస్ లు మిస్సింగ్ కావడం కలకలం రేపుతోంది.
...