Viral Video: వైరల్ వీడియో చూస్తే షాక్ తింటారు..పార్లమెంటులో గ్రహాంతర వాసుల శవాలను ప్రదర్శించిన శాస్త్రవేత్తలు, నిజం అవుతున్న ఏలియన్స్ వాదన.,.

ఈ గ్రహాంతర శవాలను UFO నిపుణుడు జామీ మౌసన్ అధికారికంగా ఆవిష్కరించారు.

(Photo-X)

లాటిన్ అమెరికా దేశం మెక్సికో పార్లమెంట్‌లో గ్రహాంతరవాసులకు సంబంధించి ఓ అసాధారణ ఘటన చోటుచేసుకుంది. మానవ నాగరికత చరిత్రలో ఇదొక చారిత్రాత్మక ఘట్టం. దీని కారణంగా, భవిష్యత్తులో గ్రహాంతరవాసులుపై ప్రజల ఆసక్తి మరింత పెరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. మెక్సికో పార్లమెంటులో అధికారిక కార్యక్రమంలో రెండు 'గ్రహాంతర వాసుల శవాలను' ప్రదర్శించారు. ఈ గ్రహాంతర శవాలను UFO నిపుణుడు జామీ మౌసన్ అధికారికంగా ఆవిష్కరించారు.

ఈ రెండు చిన్న శవాలు 1000 సంవత్సరాల నాటివని. వీటిని పెరూలోని కుజ్కో ప్రాంతంలో లభించాయని నిర్వాహకులు పేర్కొన్నారు. మెక్సికన్ విశ్వవిద్యాలయంలో 'UFO నమూనాలు' అధ్యయనం చేసినట్లు UFO నిపుణుడు జామీ మౌసన్ మెక్సికన్ ప్రభుత్వ సభ్యులకు తెలిపాడు.  అతని అంచనా ప్రకారం, రేడియోకార్బన్ డేటింగ్ ఆధారంగా DNA ఆధారాలను పొందినట్లు శాస్త్రవేత్తలు నొక్కి చెప్పారు.

UFO నిపుణుడు జామీ మౌసన్ మాట్లాడుతూ 'ఈ శవాలు మన భూమికి చెందినవి కాదని, ఇవి శిలాజాలుగా మారాయని తెలిపారు. మానవేతర గ్రహాంతర జీవులుగా భావిస్తున్న రెండు మృతదేహాలను పార్లమెంట్ లోపల ప్రదర్శించారు. UFO నిపుణుడు జామీ మౌసన్  చాలా కాలంగా గ్రహాంతర జీవుల గురించి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో అమెరికా నేవీ మాజీ పైలట్ ర్యాన్ గ్రేవ్స్ కూడా పాల్గొన్నారు. విమాన ప్రయాణాల్లో UFOలను చూసినట్లు పలుమార్లు ర్యాన్ పేర్కొన్నాడు. ఈ మమ్మీ మృతదేహాలను ఇతర వ్యక్తులు కూడా చూసేలా గాజు పెట్టెల్లో ఉంచారు. ఈ రెండు శవాలు మానవుడి తరహాలోనే ముఖాలను కలిగి ఉంటాయి. వీటికి రెండు చేతులు రెండు కాళ్లు, అలాగే కాలికి మూడు వేళ్లు ఉన్నాయి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif