The Sheep. (Photo Credits: Facebook)

ఆఫ్రికాలో ఒక మహిళను చంపిన గొర్రెకు కోర్టు మూడు సంవత్సరాల జైలుశిక్ష (Sheep Sentenced To Three Years In Jail) విధించింది. దక్షిణ సూడాన్‌లో రామ్‌ అనే గొర్రె 45 ఏళ్ల అదీయు చాపింగ్‌పై దాడి చేసింది. దీంతో ఆమె గాయాలపాలై (Killing A Woman In Africa) మరణించింది. ఈ ఘటన రుంబెక్ ఈస్ట్‌లోని అకుయెల్ యోల్ అనే ప్రదేశంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు రామ్‌ అనే గొర్రెని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడమే కాకుండా కస్టమరీ కోర్టులో ప్రోడ్యూస్‌ చేశారు. ఈ మేరకు కోర్టు రామ్‌ అనే గొర్రె కి మూడేళ్లు జైలు శిక్ష విధిచింది.

రామ్‌(గొర్రె) యజమాని డుయోని మాన్యాంగ్‌ బాధితురాలి కుటుంబానికి ఐదు ఆవులు అప్పగించాలని తీర్పు ఇచ్చింది. శిక్షలో భాగంగా రామ్‌(గొర్రె) లేక్స్ స్టేట్‌లోని సైనిక శిభిరంలో గడుపుతుందని తెలిపింది. అంతేకాదు శిక్ష ముగింపులో గొర్రెని యజమాని డుయోని కోల్పోయే అవకాశం కూడా ఉందని స్పష్టం చేసింది. అంటే దక్షిణ సూడాన్‌ చట్టాల ప్రకారం ఏదైన జంతువు దాడిలో వ్యక్తి చనిపోతే ఆ జంతువుని శిక్షా కాలం ముగింపులో బాధితుడు కుటుంబానికి పరిహారంగా ఇచ్చేస్తారు.

పురుషాంగం మొక్కలను పీకేస్తున్న మహిళలు, పెనిస్ ప్లాంట్స్‌ను తెంపేసి ఫోటోలకు ఫోజులు, ఆందోళన వ్యక్తం చేసిన కంబోడియా ప్రభుత్వం

ఈ మేరకు ఇరు వర్గాలు పోలీసులు సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు కూడా. ఇదిలా ఉండగా గొర్రెల దాడిలో వ్యక్తి మృతి చెందడం ఇదేం తొలిసారి కాదు. గతేడాది కూడా అమెరికాలో ఓ మహిళ పొలంలో గొర్రెల దాడికి గురై మరణించింది.