Calf Born with 2 Heads and 3 Eyes: రెండు తలలు, మూడు కళ్లతో జన్మించిన బుల్లి లేగదూడ, దుర్గామాత అవతారమంటూ కొలుస్తున్న జనాలు
Calf born with 2 heads and 3 eyes (Photo-Video Grab)

ప్రపంచంలో ఎక్కడ ఏ వింతలు జరిగినా జరుగుతున్నా అవి వెంటనే సోషల్ మీడియాలో వచ్చేస్తున్నాయి. ఏకంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒడిశాలోని నబ్రంగ్‌పూర్‌ జిల్లా బిజాపుర గ్రామంలో వెలుగు చూసిన ఓ విశేషం స్థానికులనేగాక నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. జిల్లాలోని కుములి పంచాయతీ బీజాపూర్ గ్రామానికి చెందిన రైతు ధనిరామ్‌ కు చెందిన ఆవు రెండు తలలు, మూడు కళ్లతో లేగదూడకు (Calf Born with 2 Heads and 3 Eyes) జన్మనిచ్చింది.

నవరాత్రి ఉత్సవాల సమయంలో (Navratri worshipped) ఘటన జరగడంతో స్థానికులు ఆ బుల్లి దూడను దుర్గామాత అవతారంగా (Maa Durga’s avatar in Odisha) కొలుస్తున్నారు. ఈ విషయం తెలిసిన సమీప గ్రామాలవారు తండోపతండాలుగా అక్కడికి చేరుకుంటున్నారు. వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు రెండు తలలు కలిగి ఉండటంతో తల్లి ఆవు నుంచి లేగదూడ పాలు తాగలేకపోతోందని వాటి యజమాని చెప్పారు. డబ్బాతో దానికి పాలు పడుతున్నామని తెలిపారు. ధనిరామ్ రెండేళ్ల క్రితం ఆవును కొనుగోలు చేశారు.

Here's Video

తొమ్మిది నెలలు నిండిన ఆవు ప్రసవ సమయంలో తీవ్ర ఇబ్బంది పడుతుందని గమనించిన రైతు వెటర్నరీ వైద్యునికి చూపించగా డాక్టర్ రెండు తలలు మరియు మూడు కళ్లతో దూడ ఉందని తెలిపాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.