దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 2,483 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. ఆదివారంతో పోల్చితే 2.2 శాతం కేసులు త‌క్కువ‌గా న‌మోదు అయ్యాయి. ఆదివారం కొత్త‌గా 2,541 మందికి క‌రోనా నిర్ధార‌ణ అయిన‌ట్లు అధికారులు తెలిపిన విష‌యం తెలిసిందే. అయితే ఢిల్లీతో పాటు 12 రాష్ట్రాల్లో కొత్త కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. క‌రోనా నుంచి 1,970 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్ర‌స్తుతం 15,636 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 187.95 కోట్ల క‌రోనా టీకా డోసుల‌ను పంపిణీ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)