దేశంలో గడిచిన 24 గంటల్లో 2,745 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా వైరస్‌ బారినపడి ఆరుగురు మృతి చెందగా.. మరో 2,236 మంది బాధితులు కోలుకొని డిశార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 18,386 ఉన్నాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 0.60శాతంగా ఉందని పేర్కొంది.తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,31,60,832 చేరింది. ఇందులో 4,26,17,810 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 5,24,636 మంది ప్రాణాలు వదిలారు. ఇదిలా ఉండగా.. దేశంలో టీకాల పంపిణీ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 1,93,57,20,807 టీకా డోసులు పంపిణీ వేసినట్లు వివరించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)