దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గురువారం 13 వేల మంది కరోనా బారినపడగా, నేడు కొత్తగా 17,336 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,33,62,294కు చేరాయి. ఇందులో 4,27,49,056 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,954 మంది మృతిచెందారు. మరో 88,284 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 13 మంది మరణించగా, 13,029 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 5218 కేసులు ఉన్నాయి. కేరళలో 3890 కేసులు, ఢిల్లీలో 1934, తమిళనాడులో 1063, హర్యానాలో 872, కర్ణాటకలో 858 కేసుల చొప్పున నమోదయ్యాయి. కాగా, పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాటివిటీ 4.32 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా యాక్టివ్‌ కేసులు 0.20 శాతం, రికరీ రేటు 98.59 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. దేశంలో ఇప్పటివరకు 196.77 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)