యూపీలోని ఖుషీన‌గ‌ర్‌లో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాన్ని ప్ర‌ధాని మోదీ ప్రారంభించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న బౌద్ద యాత్రికుల కోసం ఈ విమానాశ్ర‌యం ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌నున్న‌ది. ద‌శాబ్ధాల ఆశ‌లు, ఆశ‌యాల ఫ‌లిత‌మే కుషీన‌గ‌ర్ విమానాశ్ర‌య‌మ‌ని, ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించ‌డం సంతోష‌క‌రంగా ఉంద‌ని, ఇదో ఆధ్యాత్మిక ప్ర‌యాణ‌మ‌ని, ఇది ఎంతో సంతృప్తినిస్తోంద‌ని ప్రధాని మోదీ అన్నారు. రానున్న 4 ఏళ్ల‌లో దేశ‌వ్యాప్తంగా 200 విమానాశ్ర‌యాలు, హెలిపోర్ట్‌ల‌ను నిర్మించ‌నున్న‌ట్లు చెప్పారు.యూపీలో కొత్త‌గా 9 విమానాశ్ర‌యాల‌ను నిర్మిస్తున్నామ‌ని, జివార్ విమానాశ్ర‌యం దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ అవుతుంద‌ని ప్ర‌ధాని తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)