UP Shocker: యూపీలో దారుణం, మాజీ భార్య చేతులు కట్టేసి నాల్గో అంతస్తు నుంచి కిందకు తోసి చంపేశారు, సీసీటీవీ పుటేజీ వీడియో వైరల్
ఆగ్రాలోని నాగ్లా మేవతిలోని అపార్ట్‌మెంట్‌లో రితికా సింగ్ ఆనే వివాహిత హత్యకు గురైంది. ఆమె ఘజియాబాద్ నివాసి. ఫిరోజాబాద్ నివాసి అయిన ఆకాశ్ గౌతమ్‌ని 2014లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకే 2018లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వారు వేరువేరుగా ఉంటున్నారు.
- Read in
- తెలుగు
ఆగ్రాలోని నాగ్లా మేవతిలోని అపార్ట్‌మెంట్‌లో రితికా సింగ్ ఆనే వివాహిత హత్యకు గురైంది. ఆమె ఘజియాబాద్ నివాసి. ఫిరోజాబాద్ నివాసి అయిన ఆకాశ్ గౌతమ్‌ని 2014లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకే 2018లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వారు వేరువేరుగా ఉంటున్నారు. ఈ మేరకు రితికా సింగ్ తన ఫేస్‌బుక్ స్నేహితుడు విపుల్ అగర్వాల్‌తో నాగ్లామేవతి అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటుంది. ఇందిలా ఉండగా ఆమె మాజీ భర్త, మరో ఇద్దరు మహిళలు కలిసి ఆమె నివాసం వద్దకు వచ్చి దాడి చేసేందుకు యత్నించారు .
ఈ హఠాత్పరిణామానికి ఒక్కసారిగా షాక్ అయ్యింది రితికా. వారంతా రితికా ప్రియుడి పై కూడా దాడి చేశారు. ఆ తర్వాత వారు రితికా చేతులు కట్టేసి నాల్గో అంతస్తు నుంచి కిందకు తోసి చంపేశారు. ఈ మేరకు రితికా స్నేహితుడు విపుల్ అగర్వాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఐతే ఈ కేసుకి సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశామని, ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది.
The body of the woman has been sent for post mortem and her family members have been informed about the incident.#blogger pic.twitter.com/s0pLV95yvu
— Anuja Jaiswal (@AnujaJaiswalTOI) June 24, 2022
#cctv footage of the incident. pic.twitter.com/fXet0nO5fC
— Anuja Jaiswal (@AnujaJaiswalTOI) June 24, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 26, 2022 12:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

