Nandyal Rape and Murder Case: నంద్యాల బాలిక గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు, ఆ ముగ్గురు సెల్‌ఫోన్లో వీడియోలు చూసి పార్కులో ఆడుకుంటున్న బాలికపై..
ఏపీలోని నంద్యాలలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థినిని గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన కేసులో పోలీసుల సంచలన విషయాలను వెల్లడించారు. బాలికను అత్యాచారం చేసి చంపింది ఆ ముగ్గురు మైనర్ బాలురేనని సెల్‌ఫోన్లో వీడియోలు చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు
ఏపీలోని నంద్యాలలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థినిని గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన కేసులో పోలీసుల సంచలన విషయాలను వెల్లడించారు. బాలికను అత్యాచారం చేసి చంపింది ఆ ముగ్గురు మైనర్ బాలురేనని సెల్‌ఫోన్లో వీడియోలు చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాలికను గొంతు నులిమి చంపిన వారికి ఏం చేయాలో అర్థం కాకపోవడంతో మృతదేహాన్ని రాయి కట్టి కృష్ణానదిలో పడేసారని తెలిపారు. నంద్యాలలో దారుణం, 3వ తరగతి విద్యార్థినిని గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసి కాలువలో పడేసిన ముగ్గురు మైనర్ అబ్బాయిలు
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమరి గ్రామంలో బాలిక మిస్సింగ్ కేసులో ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ ఆదిరాజు సింగ్ రానా తెలిపారు. మైనర్ బాలిక పార్కు దగ్గర ఆడుకుంటూ ఉండగా అక్కడే ఉన్న ముగ్గురు బాలురు ఆ అమ్మాయికి చాక్లెట్ ఆశ చూపించి అత్యాచారం చేసి గొంతు నులిమి చంపారు అన్నారు. ఆ ముగ్గురు పిల్లలలో ఒక బాలుడి తండ్రి, మరో బాలుడి పెదనాన్న వారికి సహకరించి అమ్మాయి మృతదేహాన్ని కృష్ణానదిలో రాయి కట్టి పడేసినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారం మేరకు SDRF, NDRF, బృందాలతో సెర్చింగ్ నిర్వహించామని అమ్మాయిలు డెడ్ బాడీ కోసం గాలింపు చర్యలు చేస్తున్నామన్నారు.
Here's Police Statement
3వ తరగతి చదువుతున్న బాలిక గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు
బాలికను అత్యాచారం చేసి చంపింది ఆ ముగ్గురు మైనర్ బాలురే.. సెల్ ఫోన్లో వీడియోలు చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు
గొంతు నులిమి చంపిన వారికి ఏం చేయాలో అర్థం కాకపోవడంతో మృతదేహాన్ని రాయి కట్టి కృష్ణానదిలో పడేసిన నిందితుల… https://t.co/sGatv5iVyw pic.twitter.com/JruZVT3ejE
— Telugu Scribe (@TeluguScribe) July 16, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 17, 2024 12:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

