తాగుబోతు భర్త వేధింపులతో విసిగిపోయిన భార్య లోన్‌ రికవరీ కోసం గ్రామానికి వచ్చిన ఏజెంట్‌తో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకున్న ఘటన బీహార్లో చోటు చేసుకుంది. బీహార్‌లోని జముయ్‌ జిల్లాలో జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకెళితే.. తన భర్త తాగి వచ్చి తనను కొట్టేవాడని, శారీరకంగా వేధించేవాడని అందుకే..అతడి హింసను భరించలేక పరిచయమైన పవన్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.

నీ ప్రియుడితో ఎన్ని సార్లు ఎంజాయ్ చేశావు, ఈ రోజు రాత్రి ఎంజాయ్ చేయలేదు కదా, మహిళను దారుణంగా వేధించిన టాక్సీ డ్రైవర్, వీడియో ఇదిగో..

ఫిబ్రవరి 11న త్రిపురారి ఘాట్ సమీపంలోని ఆలయంలో హిందూ ఆచారం ప్రకారం వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంట వివాహాన్ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. కాగా జాజల్ గ్రామానికి చెందిన బ్యాంకు ఉద్యోగి పవన్ కుమార్ రుణాల రికవరీ కోసం పలు గ్రామాలను సందర్శిస్తూ..కొన్ని నెలల కిందట కర్మ టాండ్ గ్రామానికి వెళ్లాడు. అక్కడ ఇందిరా కుమారిని కలవడం ఫోన్ నంబర్ ఇచ్చుకోవడం చకచకా జరిగిపోయాయి.

Woman Elopes With Loan Recovery Agent To Get Married in bihar

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)