పంజాబ్ కింగ్స్ హిట్ట‌ర్ లియామ్ లివింగ్‌స్టోన్ భారీ సిక్స‌ర్‌తో కేక పుట్టించాడు. గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 117 మీట‌ర్ల దూరం సిక్స‌ర్‌ను కొట్టాడు. ఈ యేటి ఐపీఎల్ సీజ‌న్‌లోనే ఇది అతిపెద్ద సిక్స‌ర్. ష‌మీ వేసిన 16వ ఓవ‌ర్‌లో తొలి బంతినే లివింగ్‌స్టోన్ సిక్స‌ర్‌గా మ‌లిచాడు. గుడ్‌లెన్త్‌లో ప‌డ్డ బంతిని.. గ‌ట్టిగా స్క్వేర్ లెగ్‌ మీదుగా లివింగ్‌స్టోన్ కొట్టాడు. ఆ షాట్ కొట్టిన తీరుకు కామెంటేట‌ర్లు స్ట‌న్ అయ్యారు. ఆ ఓవ‌ర్‌లో తొలి బంతిని మెగా సిక్స‌ర్‌గా మ‌లిచిన లివింగ్‌స్టోన్‌.. ఆ త‌ర్వాత రెండు బంతుల‌కు కూడా రెండు సిక్స‌ర్లు వేశాడు. 10 బంతుల్లోనే 30 ర‌న్స్ చేసి పంజాబ్‌కు విజ‌యాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్ తొలుత 143 ర‌న్స్ చేసింది. ఆ ల‌క్ష్యాన్ని 16 ఓవ‌ర్ల‌లోనే పంజాబ్ చేధించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)