తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో కూటమి విభేధాలు భగ్గుమన్నాయి. కూటమిలో భాగంగా అనపర్తి అసెంబ్లీ సీటు బీజేపీ అభ్యర్థి ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించడంతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు భగ్గుమంటున్నారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం చేరుకున్న టీడీపీ కార్యకర్తలు టికెట్ నల్లమిల్లికే ఇవ్వాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. టీడీపీ కరపత్రాలను జెండాలను పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. వీడియో ఇదిగో, పార్లమెంట్ ఎన్నికల కార్యాలయం వద్ద పడుకుని భావోద్వేగానికి గురైన నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాసవర్మ
కార్యాచరణ రూపొందించేందుకు నల్లమిల్లి పిలుపుమేరకు రామవరం చేరుకున్న తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా ఆందోళన బాటపట్టారు. అదే విధంగా పార్టీ గుర్తు అయిన సైకిల్ని కూడా మంటలో పడవేసి తమ నిరసనలు తెలిపారు. కార్యకర్తలను నిలువరించేందుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన తనయుడు మనోజ్ రెడ్డి ప్రయత్నాలు చేసిన ఫలించలేదు. చివరికి కార్యకర్తలు శాంతించి సమావేశం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి నాయకులు ప్రసంగాలు చేస్తూ కార్యకర్తలు ఆందోళన చెందవద్దంటూ పిలుపునిచ్చారు.
Here's Video
#Admin post
నల్లమిల్లికి బాసటగా కార్యకర్తలు pic.twitter.com/mK2Hzv9i0C
— Nallamilli Ramakrishna Reddy (@MeeNallamilli) March 28, 2024
అనపర్తి టికెట్ బీజేపీకి ఇవ్వడంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన టీడీపీ నాయకుడు నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి కార్యకర్తలు. pic.twitter.com/syPG2fNLvk
— Telugu Scribe (@TeluguScribe) March 28, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)