నెల్లూరు జిల్లా కావలి ముంగమూరు జాతీయ రహదారి నెత్తురోడింది. కావలి రూరల్ మండలం గౌరవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. రహదారిపై ఆగి ఉన్న ఓ లారీని వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ఘటన స్థలంలోనే మరణించారు. మృతులను కావలి డివిజన్ పరిధిలోని జలదంకి మండలం చామదల గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.  మద్యం మత్తులో బస్సును నడిపిన డ్రైవర్, బ్రిడ్జిపై నుంచి కిందపడటంతో 5 మంది మృతి, మరో 38 మందికి తీవ్ర గాయాలు, విషాదకర వీడియో ఇదిగో..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, రేపటి శ్రీరామ నవమి ఉత్సవ సామగ్రి కోసం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)