వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy).. విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీతో ములాఖత్ అయ్యారు.తన అభిమాన నాయకుడు విజయవాడ పర్యటనకు వచ్చిన సందర్భంలో అభిమాన సంద్రం ఎగిసిపడింది. అయితే ఓ చిన్నారి.. వైఎస్ జగన్‌ను కచ్చితంగా కలవాలనే అక్కడకు వచ్చింది.
తాను జగనన్నను కలవాలని పట్టుబట్టింది..మారాం కూడా చేసింది. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు.. వైఎస్ జగన్‌కు తెలిపాయి. దీనికి వైఎస్ జగన్ సరే అనడంతో ఆ చిన్నారి ఉబ్బితబ్బిబ్బై పోయింది. తాను అభిమానించే నాయకుడు దగ్గరకు తీసుకునే క్రమంలో ఆనంద బాష్పాలతో తడిసి ముద్దయిపోయింది ఆ చిన్నారి. జగనన‍్నతో ఫోటోలు దిగిన క్రమంలో తెగ మురిసిపోయింది. ఇప్పడు దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
వైఎస్ జగన్ విజయవాడ పర్యటనలో వెల్లివిరిసిన అభిమానం
జగన్ విజయవాడ పర్యటనలో వెల్లివిరిసిన అభిమానం
జగన్ అన్నా అంటూ కన్నీళ్లు పెట్టుకున్న చిన్నారి pic.twitter.com/csi8WJAV3I
— Telugu Scribe (@TeluguScribe) February 18, 2025
నా జన్మ ధన్యం.. పట్టరాని ఆనందం..
-జగన్ తో పాప సెల్ఫీ🔥 pic.twitter.com/dLuRO6ywdI
— Rahul (@2024YCP) February 18, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)