Anantha Venkatarami Reddy: వీడియో ఇదిగో, మిర్చి రైతులను జగన్ పరామర్శిస్తే తప్పేంటి? కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడిన మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి
వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతున్న ప్రజాదరణను ఓర్వలేక చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు దిగిందని, ఈ క్రమంలోనే భద్రతను కుదించిందని వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి (Anantha Venkatarami Reddy) విమర్శించారు.
వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతున్న ప్రజాదరణను ఓర్వలేక చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు దిగిందని, ఈ క్రమంలోనే భద్రతను కుదించిందని వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి (Anantha Venkatarami Reddy) విమర్శించారు. వైఎస్ జగన్‌ను కలిసిన చిన్నారిని ట్రోల్ చేసిన అంశంపైనా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) విఫలమవుతోంది.
ఈ అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. జగన్ ప్రజల్లో తిరగకుండా చేసేందుకు భద్రత కుదించారు. ఇల్లీగల్ యాక్టివిటీస్‌కు భద్రత కల్పించలేమని చంద్రబాబు అంటున్నారు. రైతులను పరామర్శించడం చంద్రబాబు దృష్టిలో ఇల్లీగల్ యాక్టివిటీసా?. చంద్రబాబు అలా మాట్లాడడం దుర్మార్గం కాదా?.. మిర్చి రైతులను జగన్ పరామర్శిస్తే తప్పేంటి?. వైఎస్ జగన్ పాలనలో 24 పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరలు కల్పించింది. కానీ, టీడీపీ కూటమి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించటంలో విఫలమైందని మండిపడ్డారు.
Former MLA Anantha Venkatarami Reddy Fire On TDP Kutami Govt
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 21, 2025 01:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

