Andhra Pradesh: గుంటూరు జిల్లాలో ఘోర విషాదం, పూడిక తీస్తుండగా కరెంట్ షాక్, నలుగురు అక్కడికక్కడే మృతి, పెదకాకానిలో అలుముకున్న విషాద ఛాయలు
గుంటూరు జిల్లా పెదకాకానిలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెదకాకానిలోని నంబూరు కాళీ గార్డెన్స్ వెళ్లే మార్గంలో ఉన్న గోశాలలో కరెంట్ షాక్ కొట్టడంతో నలుగురు మృతి చెందారు. కాగా గోశాల వృథా నీటిని పక్కనే ఉన్న మూడు సంపుల్లో చేరేలా నిర్వాహకులు ఏర్పాటు చేశారు
గుంటూరు జిల్లా పెదకాకానిలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెదకాకానిలోని నంబూరు కాళీ గార్డెన్స్ వెళ్లే మార్గంలో ఉన్న గోశాలలో కరెంట్ షాక్ కొట్టడంతో నలుగురు మృతి చెందారు. కాగా గోశాల వృథా నీటిని పక్కనే ఉన్న మూడు సంపుల్లో చేరేలా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అయితే సంపులో చెత్త పేరుకుపోవడంతో నీరు లోపలకు వెళ్లలేదు. దీంతో అక్కడే పనిచేస్తున్న ఏకుల రాజేష్, యాదగిరి బాలయ్య, గంధాల మహంకాళి రావు.. పూడిక తీసేందుకు సంపులోకి మోటర్ తీసుకుని దిగారు.
అయితే మోటర్‌కి ఉన్న విద్యుత్ తీగ ప్రమాదవశాత్తు వారికి తగలడంతో ముగ్గురూ కరెంట్ షాక్ తగిలి చనిపోయారు. సూపర్‌వైజర్ శివరామ కాళీబాబు వారిని కాపాడేందుకు ప్రయత్నంచాడు. అయితే, ఆయనకూ కరెంట్ షాక్ తగలడంతో ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పెదకాకాని సీఐ నారాయణస్వామి ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Four people died due to electrocution in Pedakakani
గుంటూరు: పెదకాకాని కాలీ గార్డెన్స్ రోడ్డులో విషాదం. గోశాల దగ్గర కరెంట్ షాక్తో నలుగురు మృతి. గోశాల సంపులో పూడికతీత పనుల్లో ఘటన. రైతుతో పాటు ముగ్గురు కూలీలు మృతి.#BreakingNews #TeluguNews #APNews
— NTV Breaking News (@NTVJustIn) February 24, 2025
గుంటూరు జిల్లా పెదకాకాని కాళీ గార్డెన్స్ రోడ్డులో విషాదం.
గోశాల వద్ద విద్యుత్ షాక్తో నలుగురు మృతి చెందారు.
సంపులో పూడిక తీస్తుండగా విద్యుత్ షాక్ తగిలి నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. pic.twitter.com/4NpP7ETTAZ
— greatandhra (@greatandhranews) February 24, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 24, 2025 08:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

