Andhra Pradesh: వీడియో ఇదిగో, సీఎం చంద్రబాబు ఇలాకాలో జల్లికట్టు పోటీలు, ఎద్దు ఢీకొట్డడంతో యువకుడు అక్కడికక్కడే మృతి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన జల్లికట్టు పోటీల్లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. జల్లికట్టు క్రీడల సమయంలో ఎద్దు ఢీకొట్టడంతో అక్కడికక్కడే యువకుడు కుప్పకూలాడు. వెంటనే గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందాడు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన జల్లికట్టు పోటీల్లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. జల్లికట్టు క్రీడల సమయంలో ఎద్దు ఢీకొట్టడంతో అక్కడికక్కడే యువకుడు కుప్పకూలాడు. వెంటనే గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందాడు. వివరాల్లోకెళితే.. చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లనూరులో ఆదివారం జల్లికట్టు క్రీడోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. జల్లికట్టు క్రీడల్లో భాగంగా ఎడ్లు పరుగెత్తుతుండగా వాటిని పట్టుకునేందుకు గ్రామస్తులు పోటీపడ్డారు.
ఈ నేపథ్యంలోనే ఓ ఎద్దు ఎదురుగా వచ్చిన యువకుడిని బలంగా ఢీకొట్డడంతో అతడు ఎగిరి కిందపడ్డాడు. కుప్పకూలిపోయిన అతడిని చూసి గ్రామస్తులు, అతడి కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందాడని బంధువులు చెబుతున్నారు. మృతుడిని అడవి బూదుగూరు గ్రామానికి చెందిన కరుణాకరన్ గా గుర్తించారు. సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో అనుమతి లేకుండానే భారీగా జల్లికట్టు పోటీలు జరుగుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. జల్లికట్టు నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని కుప్పం డీఎస్పీ పార్థసారథి చెప్పినప్పటికీ చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి.
young man died after being hit by a bull during Jallikattu
సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో జల్లికట్టు పోటీల్లో తీవ్ర విషాదం
కుప్పం నియోజకవర్గం మల్లనూరులో ఆదివారం జరిగిన జల్లికట్టులో ఎద్దు ఢీకొట్డడంతో అడవి బూదుగూరుకు చెందిన కరుణాకరన్ అనే యువకుడు మృతి
సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో అనుమతి లేకుండానే భారీగా జరుగుతున్న జల్లికట్టు పోటీలు… pic.twitter.com/oJsnHsOPo8
— Telugu Scribe (@TeluguScribe) February 24, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 24, 2025 08:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

