క‌రీంన‌గ‌ర్ జిల్లా మాన‌కొండూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే క‌వ్వంప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ.. నియోజకవర్గంలో నిర్వ‌హించిన నూతన సంవత్సర వేడుక‌ల్లో అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు.కాంగ్రెస్ మహిళా కార్యకర్తలతో అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో వైరల్ అవుతోంది. కేక్ క‌టింగ్ సంద‌ర్భంగా అక్క‌డున్న మ‌హిళా కార్య‌క‌ర్త ముఖానికి ఆయ‌న కేక్ పూయ‌గా, ఆమె ప‌క్క‌కు త‌ప్పుకుంది. అయితే రాష్ట్ర మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ను పక్కకు జరిపి మ‌రీ ఎమ్మెల్యే స‌త్య‌నారాయ‌ణ ఆ మ‌హిళా కార్య‌క‌ర్త‌కు కేక్‌ పూశారు.వీడియో నెట్టింట్లో వైర‌ల్ కావడంతో మాన‌కొండూరు ఎమ్మెల్యేపై నెటిజ‌న్లు, స్థానికులు తీవ్రంగా మండిప‌డుతున్నారు. దీనిపై ఎమ్మెల్యే అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)