తెలంగాణలోని గురుకులంలో మరో కీచక టీచర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది(Teacher Harasses). తోటి మహిళా ఉద్యోగినిపౌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఉపాధ్యాయుడు. మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట ప్రభుత్వ గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో తోటి మహిళా ఉద్యోగినిపై గురుకుల ఉపాధ్యాయుడు నైతం శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు(Teacher sexually harasses female colleague). అంతేగాదు మహిళా ఉద్యోగినిపై దాడి చేసి గాయపర్చాడు నైతం శ్రీనివాస్.
గతంలో కూడా విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేశాడని శ్రీనివాస్ పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు.
Teacher Harasses Female Colleague at Mancherial
గురుకులంలో కీచక ఉపాధ్యాయుడు
తోటి మహిళా ఉద్యోగినికి లైంగిక వేధింపులకు గురిచేసిన ఉపాధ్యాయుడు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట ప్రభుత్వ గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో తోటి మహిళా ఉద్యోగినిపై గురుకుల ఉపాధ్యాయుడు నైతం శ్రీనివాస్ లైంగిక వేధింపులు
మహిళా ఉద్యోగినిపై దాడి చేసి… pic.twitter.com/YMPHcKGSMq
— Telugu Scribe (@TeluguScribe) March 6, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)