Telangana Congress Social Media: తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా.. పబ్లిక్ పోల్ పెట్టి మరి ఇలా చేశారేంటి?!, కేసీఆర్ పాలననే కోరుకున్న నెటిజన్లు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం చేసిన పని ఆ పార్టీ నేతలను ఇరకాటంలోకి నెట్టేసింది.

Telangana Congress Social Media: తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా.. పబ్లిక్ పోల్ పెట్టి మరి ఇలా చేశారేంటి?!, కేసీఆర్ పాలననే కోరుకున్న నెటిజన్లు
Telangana Congress Official Social Media post goes viral(X)

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం చేసిన పని ఆ పార్టీ నేతలను ఇరకాటంలోకి నెట్టేసింది. తమ అఫిషియల్ సోషల్ మీడియా పేజీలో పెట్టిన ఓ పబ్లిక్ పోల్‌లో ఘోరంగా ఓడిపోయి పరువు తీసుకుంది కాంగ్రెస్ సోషల్ మీడియా(Telangana Congress Social Media).

తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పాలన కోరుకుంటున్నారు అని ఓపినియన్ పోల్ పెట్టారు(Public Poll) కాంగ్రెస్ సోషల్ మీడియా నేతలు. ఫామ్ హౌస్ పాలన, ప్రజల వద్దకే పాలన అంటూ రెండు ఆప్షన్లు ఇవ్వగా మెజార్టీ ప్రజలు ఫామ్ హౌస్ పాలన(కేసీఆర్‌)కే(KCR) జై కొట్టారు.

ఇక ఈ పబ్లిక్ పోల్‌ను అలానే పోస్ట్ చేశారు కాంగ్రెస్ నేతలు. తమ పార్టీని ప్రజలు వద్దనుకుంటున్నారని చెప్పకనే చెప్పేలా ఈ పోస్ట్ ఉండగా కాంగ్రెస్ నేతలు ఇబ్బందుల్లో పడ్డారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారగా మరీ కాంగ్రెస్ నేతలు ఏ విధంగా సమర్ధించుకుంటారో వేచిచూడాలి.  టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు..రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, విధివిధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశం 

Telangana Congress Official Social Media post goes viral

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 30, 2025 01:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).