Corona in TS: తెలంగాణలో కొత్తగా 239 కరోనా కేసులు, తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 68 కేసులు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 50,569 కరోనా పరీక్షలు నిర్వహించగా, 239 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 17, నల్గొండ జిల్లాలో 16, రంగారెడ్డి జిల్లాలో 16 కేసులు వెల్లడయ్యాయి.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 239 కరోనా కేసులు, తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 68 కేసులు
Coronavirus Outbreak (Photo credits: IANS)

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 50,569 కరోనా పరీక్షలు నిర్వహించగా, 239 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 17, నల్గొండ జిల్లాలో 16, రంగారెడ్డి జిల్లాలో 16 కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్, నారాయణపేట జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 336 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,64,650 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,55,961 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,778 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,911కి పెరిగింది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 25, 2021 11:19 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).