తెలంగాణలో కరోనా వ్యాప్తి కనిష్ఠ స్థాయికి పడిపోయింది. గడచిన 24 గంటల్లో 25,658 కరోనా పరీక్షలు నిర్వహించగా, 90 కొత్త కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదులో 35 కొత్త కేసులు నమోదు కాగా... 13 జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 172 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 7,90,224 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,84,972 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,141 మంది చికిత్స పొందుతున్నారు. 4,111 మంది కరోనాతో మరణించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)