Chandra Babu Naidu (Photo/Twitter/TDP)

Kurnool, Nov 18: రాయలసీమ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. చంద్రబాబు (Chandrababu) గో బ్యాక్ అంటూ లాయర్లు, వైసీపీ (YCP) కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. పోటీగా టీడీపీ (TDP) శ్రేణులు కూడా నిరసన చేపట్టారు. దీంతో ఇరు వర్గాలను పోలీసులు అడ్డుకున్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను రౌడీలకు రౌడీని.. గూండాలకు గూండాను.. ప్రజలకు తప్ప మరెవ్వరికీ భయపడను.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తా.. నన్ను రెచ్చగొట్టిన వాళ్ల పతనం ఖాయం.. వైసీపీ నేతలు అబద్ధాలు చెప్పడం మానుకోవాలి’’ అంటూ చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు.

తెలంగాణలో మళ్లీ వేడెక్కిన పొలిటికల్‌ వార్‌, నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అరవింద్‌ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి, ప్రతిగా తెలంగాణ భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలు

సీఎం జగన్‌రెడ్డి (CM Jagan) మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని, వైసీపీ పేటీఎమ్ బ్యాచ్‌ తనపైనే దాడి చేయాలనుకుంటోందని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలకు తాను కనుసైగ చేస్తే మీరు చిత్తు చిత్తు అవుతారని ఆయన హెచ్చరించారు. అసెంబ్లీలో అమరావతిని రాజధాని చేస్తామంటే జగన్ ఒప్పుకున్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు.

మరోవైపు చంద్రబాబుకు వ్యతిరేకంగా కర్నూలు జేఏసీ నేతలు, న్యాయవాదులు, విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు గో బ్యాక్‌ అంటూ నినాదాలు ఇచ్చారు. బాబుకు వ్యతిరేకంగా నల్లజెండాలు, బ్లాక్‌బెలూన్లతో ప్రదర్శన నిర్వహించారు. కర్నూలు న్యాయరాజధానిపై చంద్రబాబు వైఖరి చెప్పాలంటూ నిలదీశారు. విద్యార్థి జేఏసీ, న్యాయవాదులను పోలీసులు అడ్డుకున్నారు.

చంద్రబాబు స్పీచ్ ఇదే..

రాయలసీమకు ఎవరేం చేశారో చర్చించడానికి తాను సిద్ధమని అన్నారు. ఎవడ్రా రాయలసీమ ద్రోహి... పనికిమాలిన దద్దమ్మల్లారా! అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనే రాయలసీమ ద్రోహి అని పేర్కొన్నారు. రాయలసీమను దోచుకునే శక్తి వైసీపీకి ఉందని, రాయలసీమను సస్యశ్యామలం చేసే శక్తి టీడీపీకే ఉందని చంద్రబాబు వివరించారు. రాయలసీమను తాము రతనాల సీమ చేస్తే, జగన్ రెడ్డి రాయలసీమకు ద్రోహం తలపెడుతున్నాడని చంద్రబాబు విమర్శించారు.

జగన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని విమర్శించారు. "విశాఖ వెళ్లి ఉత్తరాంధ్ర వాళ్లను రెచ్చగొడతావు, రాయలసీమ వచ్చి ఇక్కడి వాళ్లను రెచ్చగొడతావు. మతాలకు, కులాలకు చిచ్చుపెట్టి చలికాచుకునే నువ్వు రాజకీయం చేస్తావా? ఇదేం పులివెందుల అనుకుంటున్నావా... తరిమి తరిమి కొట్టిస్తా. వైసీపీ గూండాలు ఒకటే గుర్తుపెట్టుకోండి... బట్టలిప్పి కొట్టిస్తా. మర్యాదకు మర్యాద... దెబ్బకు దెబ్బ. ప్రజాస్వామ్యం కోసం ప్రాణాలైనా ఇస్తా. 23 బాంబులకే భయపడలేదు. నాపైనే దాడి చేయాలనుకుంటున్నారు... మా కార్యకర్తలకు నేను కనుసైగ చేస్తే మీరు చిత్తు చిత్తు అవుతారు" అంటూ హెచ్చరించారు.

"పోలీసులు ఎవరికి కాపలా కాస్తున్నారు... ఎందుకయ్యా ఎస్పీ ఇక్కడ? ఎస్పీ ఏంచేస్తున్నారు ఇక్కడ? కబ్జాదారులకు కాపలా కాస్తారా, రౌడీలకు అండగా ఉంటారా? నీకు ఐపీఎస్ ఇచ్చిందే దండగ! తమ్ముళ్లూ... నన్ను రెచ్చగొడుతున్నాడు... నన్ను రెచ్చగొట్టినవాడి పతనం ఖాయం! నేను ఎవరికీ భయపడను... ఒక్క ప్రజలకు తప్ప. నేను రౌడీలకు రౌడీని, గూండాలకు గూండాని" అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.