Andhra Pradesh Floods: నడకదారిలో వెళ్ళే భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, తిరుమల ఘాట్ రోడ్డులో విరిగి పడిన కొండ చరియలు, యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మరమ్మతులు చేస్తున్నామని తెలిపిన వైవీ సుబ్బారెడ్డి

వరదలకు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిప‌డ్డాయి. దీంతో ఘాట్ రోడ్డు భారీగా ధ్వంసమైందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం తెల్లవారుజామున 5:40 గంటల సమయంలో భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడి రక్షణ గోడలు, రోడ్లు ధ్వంసమయ్యాయి.

Andhra Pradesh Floods: నడకదారిలో వెళ్ళే భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, తిరుమల ఘాట్ రోడ్డులో విరిగి పడిన కొండ చరియలు, యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మరమ్మతులు చేస్తున్నామని తెలిపిన వైవీ సుబ్బారెడ్డి
Tirumala Ghat Road suffers damages (Photo-Twitter)

Tirupati, Dec 1: వరదలకు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిప‌డ్డాయి. దీంతో ఘాట్ రోడ్డు భారీగా ధ్వంసమైందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం తెల్లవారుజామున 5:40 గంటల సమయంలో భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడి రక్షణ గోడలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈ ప్రాంతాలను పరిశీలించారు. నాలుగు చోట్ల భారీ ప్రమాదం జరిగిందని, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దయవల్ల ఎవరూ గాయపడలేదని అధికారులు వివరించారు. అనంతరం చైర్మన్ అధికారులకు పలు సూచనలు చేశారు.

గత 30 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఇటీవల కురిసిన వర్షాలకు (Andhra Pradesh Floods) తిరుమల ఘాట్ రోడ్లలో కొండ చరియలు విరిగిపడుతున్నాయని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఉదయం 5:45 గంటల సమయంలో ఆర్టీసీ బస్సు తిరుమలకు వెళుతుండగా భారీ శబ్దం, పొగ రావడంతో డ్రైవర్ బస్సు నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చైర్మన్ చెప్పారు. అప్ ఘాట్ రోడ్డులో మరో ఐదారు చోట్ల కొండ చరియలు (Tirumala Ghat Road suffers damages ) విరిగిపడే ప్రమాదం గుర్తించామన్నారు. వీలైనంత త్వరలో రోడ్డు మరమ్మతులు చేసి, గట్టి రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని చైర్మన్ చెప్పారు.

ఢిల్లీ ఐఐటీ నుంచి నిపుణుల బృందం బుధవారం సాయంత్రానికి తిరుపతికి చేరుకుంటుందన్నారు. టీటీడీ ఇంజినీరింగ్, విజిలెన్స్ అధికారులతో కలిసి వారు ఘాట్ రోడ్ల పరిశీలన చేస్తారన్నారు. కొండ చరియలు విరిగిపడకుండా ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలనే విషయంపై వారు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రెండు, మూడు రోజుల్లో నివేదిక సమర్పిస్తారని ఆయన వివరించారు. ఆ తరువాత భవిష్యత్‌లో కూడా ఇలాంటి సంఘటనలు జరగ‌కుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘాట్ రోడ్డు మరమ్మతులు పూర్తి అయ్యే వరకు డౌన్ ఘాట్ రోడ్డులోనే వాహనాల రాకపోకలు అనుమతిస్తామని అన్నారు.

వరద బాధితులకు అండగా టాలీవుడ్ ప్రముఖులు, సీఎం సహాయ నిధికి రూ. 25 లక్షలు సాయం ప్రకటించిన మహేష్ బాబు, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్

ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు బుక్ చేసుకుని వాహనాల ద్వారా తిరుమలకు వచ్చే భక్తులు భారీ వర్షాల దృష్ట్యా తమ ప్రయాణం వాయిదా వేసుకుంటే ఆరు నెలల్లోగా దర్శనం తేదీ మార్పు చేసుకునే అవకాశం ఉందని సుబ్బారెడ్డి చెప్పారు. నడకదారిలో తిరుమలకు వెళ్ళే భక్తులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన తెలిపారు. జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఈ జగదీశ్వరరెడ్డి, ఇతర అధికారులు ఛైర్మన్ వెంట ఉన్నారు.

టీటీడీ ఇంజినీరింగ్, విజిలెన్స్ అధికారులతో కలిసి వారు ఘాట్ రోడ్ల పరిశీలన చేస్తారన్నారు. కొండ చరియలు విరిగిపడకుండా ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలనే విషయం పై వారు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రెండు, మూడు రోజుల్లో నివేదిక సమర్పిస్తారని ఆయన వివరించారు. ఆ తరువాత భవిష్యత్ లో కూడా ఇలాంటి సంఘటనలు జరక్కుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఆయన వెంట జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఈ జగదీశ్వరరెడ్డి, ఈఈ జగన్మోహన్ రెడ్డి, ఈఈ సురేంద్ర రెడ్డి, డీఎఫ్వో శ్రీనివాసులు రెడ్డి తదితరులు ఉన్నారు.

(The above story first appeared on LatestLY on Dec 01, 2021 08:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).