AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,501 కోవిడ్ కేసులు, 10 మరణాలు నమోదు మరియు 1,697 మంది రికవరీ, రాష్ట్రంలో 13,696 గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
అన్ని జిల్లాల్లోనూ పాజిటివిటీ రేటు 3 లోపే ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రికవరీలు కూడా తగ్గుతుండటంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి, ఏపిలో కోవిడ్ రికవరీ రేటు 98.45%గా...
Amaravathi, August 19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఒకటి, రెండు జిల్లాలు మినహా దాదాపు అన్ని జిల్లాల్లోనూ పాజిటివిటీ రేటు 3 లోపే ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రికవరీలు కూడా తగ్గుతుండటంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి, ఏపిలో కోవిడ్ రికవరీ రేటు 98.45%గా మెరుగైన స్థితిలో ఉంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 2 కోట్ల మందికి టీకాల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ నివేదికలు తెలుపుతున్నాయి.
ప్రస్తుతం ఏపిలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 67,716 మంది శాంపుల్స్‌ను పరీక్షించగా 1,501 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 19,98,603కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 19,95,708 గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో తూర్పు గోదావరి జిల్లా నుంచి 315, నెల్లూరు నుంచి 242 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 10 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 13,696కు పెరిగింది.
మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 1,697 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 19,69,169 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 13,696 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.
(The above story first appeared on LatestLY on Aug 19, 2021 07:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

