Corona in Andhra Pradesh: కరోనా థర్డ్ వేవ్ అలర్ట్, 462 ప్రైవేటు ఆస్పత్రులను సిద్ధం చేసిన ఏపీ సర్కారు, ఎలాంటి సమయంలో రోగులు వచ్చినా సేవలు అందించాలని ఆదేశాలు, ఏపీలో తాజాగా 2,050 మందికి కోవిడ్

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 85,283 పరీక్షలు నిర్వహించగా.. 2,050 కేసులు నిర్ధారణ (Corona in Andhra Pradesh) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,82,308 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ (Covid) వల్ల 18 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,531కి చేరింది.

Corona in Andhra Pradesh: కరోనా థర్డ్ వేవ్ అలర్ట్, 462 ప్రైవేటు ఆస్పత్రులను సిద్ధం చేసిన ఏపీ సర్కారు, ఎలాంటి సమయంలో రోగులు వచ్చినా సేవలు అందించాలని ఆదేశాలు, ఏపీలో తాజాగా 2,050 మందికి కోవిడ్
COVID-19 Outbreak. | (Photo Credits: IANS)

Amaravati, August 8: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 85,283 పరీక్షలు నిర్వహించగా.. 2,050 కేసులు నిర్ధారణ (Corona in Andhra Pradesh) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,82,308 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ (Covid) వల్ల 18 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,531కి చేరింది.

24 గంటల వ్యవధిలో 2,458 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,48,828కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,949 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,51,93,429 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. గత 24 గంటల్లో చిత్తూరులో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, తూర్పుగోదావరిలోఇద్దరు, గుంటూరులో ఇద్దరు, అనంతపూర్, ప్రకాశం, విశాఖ, పశ్చిమ గోదావరిలో ఒకరు చొప్పున మరణించారు.

టీటీడీ చైర్మన్‌గా మరోసారి వై.వి.సుబ్బారెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు, టీటీడీ బోర్డు సభ్యుల నియామకం త్వరలో జరిగే అవకాశం

రాష్ట్రంలో కరోనా థర్డ్‌వేవ్‌ (Coronavirus Third wave) వచ్చినా ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలతోపాటు 462 ప్రైవేటు ఆస్పత్రులను కూడా సిద్ధం చేస్తోంది. ప్రైవేటులో చాలావరకు 50 నుంచి 100 పడకలలోపు ఆస్పత్రులున్నాయి. 100 పడకలకంటే ఎక్కువ ఉన్న ఆస్పత్రులు 65 ఉన్నాయి. కరోనా సేవల్లో భాగంగా ఈ ప్రైవేటు ఆస్పత్రులు 33,793 డీటైప్‌ ఆక్సిజన్‌ సిలిండర్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే 17,841 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.

రేపే రైతుల ఖాతాల్లోకి రూ. 2 వేలు, పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధులు విడుదల చేయనున్న కేంద్రం, పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన జాబితాలో ల‌బ్దిదారుల పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇలా..

సాధారణ పడకలతోపాటు ఆక్సిజన్‌ పడకలు కూడా సిద్ధం చేసి ఉంచాలని ఆదేశించింది. ఎలాంటి సమయంలో రోగులు వచ్చినా సేవలు అందించాలని కోరింది. ఈ నెల చివరి నాటికి అన్ని ఆస్పత్రుల్లో సౌకర్యాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటోంది. కాగా, అత్యధికంగా గుంటూరు జిల్లాలో 63, కృష్ణా జిల్లాలో 60 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నట్టు తేలింది. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 11 మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చదువుతున్న నర్సింగ్, పారామెడికల్, ఫార్మసీ, ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులను సైతం కోవిడ్‌ సేవల్లో వినియోగించుకోనుంది.

(The above story first appeared on LatestLY on Aug 08, 2021 05:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).