Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Gudur, April 21: గూడూరులో కామాంధులు రెచ్చిపోయారు. వావి వరసలు మరచి అత్యాచారానికి పాల్పడ్డారు. స్నేహితుడి భార్యపైనే కన్నేసి అఘాయిత్యానికి (Husband’s friend ‘rapes’ woman) పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. మరో ఘటనలో కూతురు స్నేహితురాలిపైనే ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. గూడూరు ( Gudur rural mandal)చవటపాళెంకు చెందిన సోగా హరినారాయణ అలియాస్‌ హరికుట్టి అదే ప్రాంతంలోని ఓ వ్యక్తితో స్నేహంగా ఉంటున్నాడు.

ఈ క్రమంలో అతడి భార్యపై కన్నేసి సమయం కోసం ఎదురు చూశాడు. మంగళవారం స్నేహితుడు పని నిమిత్తం బయటి ప్రాంతానికి వెళ్లాడు. హరినారాయణ ఇదే అదునుగా భావించాడు. అదే రోజు రాత్రి ఆరుబయట పిల్లలతో నిద్రిస్తున్న స్నేహితుడి భార్య తలపై మొదట ఇనుప రాడ్‌తో బలంగా కొట్టాడు. ఆమె స్పహ తప్పడంతో పక్కనే ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బుధవారం ఉదయం తేరుకుని విషయం బంధువులకు తెలియజేయడంతో వారు రూరల్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ పీ.శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పోలీసు సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివాహితను వైద్యపరీక్షల నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

గుంటూరులో దారుణం, బాలికపై 80 మంది కామాంధులు అత్యాచారం, 74మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరో ఆరుగురి కోసం గాలింపు

ఇక రెండవ పట్టణ ఎస్‌ఐ తిరుపతయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరు రూరల్‌ ( Gudur rural mandal) పరిధిలోని వేములపాళెంకు చెందిన వెంకటేశ్వర్లు ఓ ప్రయివేట్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతని కుమార్తె ఓ ప్రవేటు కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న గూడూరుకు చెందిన 16 ఏళ్ల బాలిక వెంకటేశ్వర్లు కుమార్తెకు స్నేహితురాలు. బుధవారం ఈ విద్యార్థిని కళాశాలకు వెళ్లడం కాస్త ఆలస్యమైంది.

అప్పటికే కుమార్తెను కళాశాలలో వదిలిన వెంకటేశ్వర్లు.. ఆ బాలిక రాకను గుర్తించి మాయమాటలతో రూరల్‌ ఏరియాలోని పారిచెర్ల వద్ద అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంతలో స్థానికులు గమనించి కేకలు వేయడంతో వెంకటేశ్వర్లు పరారు కాగా.. బాలిక అక్కడి నుంచి ఇంటికి చేరుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనపై రెండవ పట్టణ పోలీసులకు పిర్యాదు చేశారు. ఆ మేరకు బాలికను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తిరుపతయ్య తెలిపారు.