AP Shocker: ఎస్సై కాదు కట్న పిశాచి, కానిస్టేబుల్‌తో లవ్ ఎఫైర్, పెళ్లి తర్వాత కట్నం కావాలంటూ వేధింపులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న దిశ పోలీసులు

ఏపీలోని నెల్లూరు జిల్లాలో భార్యను వేధించిన ఘటనలో (SI Cheats Woman Constable) ఓ ఎస్సైపై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు పోలీసుల కథనం మేరకు.. వేదాయపాళెం ఎస్సైగా షేక్‌ మహబూబ్‌ సుభాని పని చేస్తున్నారు.

AP Shocker: ఎస్సై కాదు కట్న పిశాచి, కానిస్టేబుల్‌తో లవ్ ఎఫైర్, పెళ్లి తర్వాత కట్నం కావాలంటూ వేధింపులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న దిశ పోలీసులు
Representational Image | (Photo Credits: PTI)

Nellore, Oct 4: ఏపీలోని నెల్లూరు జిల్లాలో భార్యను వేధించిన ఘటనలో (SI Cheats Woman Constable) ఓ ఎస్సైపై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు పోలీసుల కథనం మేరకు.. వేదాయపాళెం ఎస్సైగా షేక్‌ మహబూబ్‌ సుభాని పని చేస్తున్నారు. ఆయన సంతపేటలో విధులు నిర్వహించే సమయంలో కానిస్టేబుల్‌గా ఉన్న ఓ యువతిని ప్రేమ వివాహం (Love Marriage In Nellore) చేసుకున్నాడు.

కొద్ది రోజులు బాగానే ఉన్నా తరువాత వేధింపులు మొదలయ్యాయి.

బాలిక మళ్లీ రూంకి రాలేదని పాత వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిన కామాంధుడు, తెలంగాణలోని జనగాం జిల్లాలో నిందితుడు అరెస్ట్

అదనపుకట్నం కోసం ఆమెను భర్త, అత్తింటివారు వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే గతనెల 9వ తేదీన ఆమెపై భర్త, అత్త కట్నం కోసం ఆమెపై దాడి చేశారు. ఇది జరిగిన తర్వాత ఎస్సై సెలవు పెట్టి తన స్వగ్రామానికి వెళ్లిపోయారు.బాధితురాలు ఆ నెల 28న దిశా మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై, అతని కుటుంబసభ్యులపై వేధింపులు, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. దిశ మహిళా పోలీసుస్టేషన్‌ ఎస్సై కె.లేఖా ప్రియాంక కేసు దర్యాప్తు చేస్తున్నారు.దీనిపై ఉన్నతాధికారులు గోప్యంగా విచారణ చేపట్టారు.

(The above story first appeared on LatestLY on Oct 04, 2022 01:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).