Harishrao On Kaushik Reddy Issue: కౌశిక్ రెడ్డిపై దాడిని ఖండించిన హరీశ్ రావు, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్న, ఎమ్మెల్యే గాంధీని అరెస్ట్ చేయాలని డిమాండ్..
ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీ మధ్య నెలకొన్న వివాదం తారాస్థాయికి చేరింది. కౌశిక్ రెడ్డి ఇంటిపై రాళ్లు, కోడి గుడ్లతో దాడి చేశారు గాంధీ అనుచరులు. గేట్లు, గోడ దూకి మరి దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్ నేతల దాడిలో కౌశిక్ రెడ్డి ఇంటి కిటికీలు ధ్వంసం అయ్యాయి.
Hyd, Sep 12: ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీ మధ్య నెలకొన్న వివాదం తారాస్థాయికి చేరింది. కౌశిక్ రెడ్డి ఇంటిపై రాళ్లు, కోడి గుడ్లతో దాడి చేశారు గాంధీ అనుచరులు. గేట్లు, గోడ దూకి మరి దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్ నేతల దాడిలో కౌశిక్ రెడ్డి ఇంటి కిటికీలు ధ్వంసం అయ్యాయి.
ఈ నేపథ్యంలో ఎక్స్ ద్వారా స్పందించారు మాజీ మంత్రి హరీశ్ రావు. పట్టపగలు ప్రజాప్రతినిధి మీద జరిగిన ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశరాఉ. దాడి చేసిన గాంధీని, అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని..ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నించిన హరీశ్..మా పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంతో పాటు, వారినే ఉసిగొల్పి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఓరేయ్ కౌశిక్ రెడ్డి దమ్ముంటే రా అని సవాల్ విసిరిన ఎమ్మెల్యే గాంధీ, నీ ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరేసి తీరుతానని కౌశిక్ మరోసారి సవాల్
Here's Harishrao Tweet:
ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం..
మా పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంతో పాటు, వారినే ఉసిగొల్పి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య.
కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.…
— Harish Rao Thanneeru (@BRSHarish) September 12, 2024
కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని..ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో జరిగిన దాడి ఇది. రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాళ్లు, గుడ్లు, టమాటాలతో మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మంది మార్బలంతో వెళ్లి దాడి చేయడం హేయమైన చర్య అని..పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందన్నది సుస్పష్టం. ఇంటి మీదకు వస్తామని ప్రెస్ మీట్ లో ప్రకటించి, అనుచరులతో దాడి చేసినప్పటికీ నిలువరించడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ తీవ్రంగా విఫలమైందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
(The above story first appeared on LatestLY on Sep 12, 2024 02:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

