Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేడు ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత.. 11 గంటలకు అధికారుల ముందుకు.. కేసీఆర్ కూతురిని అరెస్టు చేస్తారంటూ సర్వత్రా ఊహాగానాలు.. కవిత విచారణ నేపథ్యంలో మరో ఏడుగురికి ఈడీ నోటీసులు జారీ.. మరింత హాట్ టాపిక్ గా మారిన లిక్కర్ స్కాం.. వీడియోలతో..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు.
Newdelhi, March 11: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scam) నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavita) ఇవాళ ఈడీ (ED) ముందు విచారణకు హాజరుకానున్నారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు కవిత అధికారుల ముందుకు రానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే 11 మందిని అరెస్టు చేసిన ఈడీ అధికారులు... ఇవాళ కవితను అరెస్టు చేస్తారనే ఊహాగానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై.. తాను కవితకు బినామీని అనీ, అంతా ఆమె చెప్పిన ప్రకారమే చేశానని... ఈడీ విచారణలో స్టేట్‌మెంట్ ఇవ్వడంతో... కవితను ప్రశ్నించేందుకు అధికారులు రెడీ అయ్యారు.
నిందితులతో కలిపి విచారణ!
ఇవాళ ఈడీ అధికారులు... లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న వారితో కలిపి కవితను ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ఇద్దరు లేదా ముగ్గురిని ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను ప్రశ్నించే అవకాశాలున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఎవరు ఎలాంటి స్టేట్‌మెంట్ ఇస్తున్నారో అధికారులు నమోదు చేసుకుంటారు. ఎవరైనా తప్పుడు సమాధానాలు చెబుతున్నట్లు అనిపిస్తే.. ఈడీ అధికారులు తమ దగ్గర ఉన్న ఎవిడెన్స్ చూపిస్తూ ప్రశ్నించే అవకాశం ఉంది. తద్వారా తప్పు చేసినట్లు నిందితులతోనే చెప్పించాలనేది ఈడీ వ్యూహంగా తెలుస్తోంది. ఐతే.. ఇవాళ కవితను ఎంతసేపు ప్రశ్నిస్తారన్నది తెలియలేదు.
కవితకు అండగా కేటీఆర్
కవితను నిజంగానే ఇవాళ అరెస్టు చేస్తారో లేదోగానీ.. ఊహాగానాలు వెలువడుతుండటంతో... మంత్రులు కేటీఆర్ , హరీశ్ రావులు నిన్న హడావుడిగా ఢిల్లీ వెళ్లారు. ఇవాళ, రేపు కేటీఆర్, హరీశ్‌రావు ఢిల్లీలోనే ఉంటారని తెలిసింది. ఈ కేసును న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలనే అంశంపై కేటీఆర్... న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటారని తెలిసింది. అయితే కవిత విచారణ నేపథ్యంలో మరో ఏడుగురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. అభిషేక్ సోదరుడితో పాటు విజయ నాయర్ ఫ్రెండ్ మనీష్, వ్యక్తిగత సిబ్బందికి పీఎంఎల్ఏ సెక్షన్ 50/2 కింద నోటీసులు ఇచ్చారు. రానున్న వారం రోజుల్లో వీరిని ఈడీ విచారించనుంది. కవిత విచారణ నేపథ్యంలో ఈ కేసులో మరికొంతమందికి నోటీసులు జారీ చేయడం కీలకంగా మారింది.
మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటి పూట బడులు, ఏప్రిల్ 25 నుండి పాఠశాలలకు వేసవి సెలవులు
(The above story first appeared on LatestLY on Mar 11, 2023 09:10 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

