BRS Secunderabad LS Candidate: సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా MLA పద్మారావు గౌడ్ ప్రకటించిన కేసీఆర్..

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే, మాజీ మంత్రి, సీనియర్‌ నేత టి పద్మారావు గౌడ్‌ను బీఆర్‌ఎస్‌ బరిలోకి దించనుంది. ఈ స్థానానికి పార్టీ అభ్యర్థిగా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ఆయన పేరును శనివారం ప్రకటించారు.

mla padma rao

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే, మాజీ మంత్రి, సీనియర్‌ నేత టి పద్మారావు గౌడ్‌ను బీఆర్‌ఎస్‌ బరిలోకి దించనుంది. ఈ స్థానానికి పార్టీ అభ్యర్థిగా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ఆయన పేరును శనివారం ప్రకటించారు. నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన పార్టీ శాసనసభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాత పద్మారావు పేరును ఖరారు చేశారు.  పార్టీ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా వున్న పద్మారావు గౌడ్ అందరివాడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన నిబద్ధతకలిగిన స్థానిక నేతగా ఆ ప్రాంత ప్రజలు బస్తీవాసులందరికీ పజ్జన్న’గా ఆదరాభిమానాలు పొందిన పద్మారావు గౌడ్ ను సరియైన అభ్యర్థిగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. అందరి ఏకాభిప్రాయం మేరకు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ ను బరిలోకి దింపాలని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Mahesh Kumar Goud: తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు.. మతచిచ్చుతో ఎల్లకాలం రాజకీయాలు చేయలేరని పీసీసీ చీఫ్ ఫైర్, కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మహేష్ కుమార్ గౌడ్

SLBC Tunnel Collapse Update: ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్‌ రెండ్రోజుల్లో పూర్తి చేస్తాం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన, రాజకీయం చేయడానికి హరీశ్‌రావు వచ్చారని మండిపాటు

Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు నోటీసులు ఇచ్చిన విజయవాడ పోలీసులు, అత్యాచార బాధితుల గుర్తింపు బహిర్గతం చేశారని వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు, మార్చి 5న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు

Advertisement
Share Now
Advertisement