Corona in Telangana: తెలంగాణలో కొత్తగా 605 మందికి కరోనా, ప్రస్తుతం రాష్ట్రంలో11,964 యాక్టివ్‌ కేసులు, ఏడు మంది మృతితో 3,691కి చేరుకున్న మరణాల సంఖ్య

Corona in Telangana: తెలంగాణలో కొత్తగా 605 మందికి కరోనా, ప్రస్తుతం రాష్ట్రంలో11,964 యాక్టివ్‌ కేసులు, ఏడు మంది మృతితో 3,691కి చేరుకున్న మరణాల సంఖ్య
Coronavirus testing | File Image | (Photo Credits: PTI)

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 71,800 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 605 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,26,690కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఏడుగురు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,691కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1,088 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,11,035కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో11,964 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక్కడ ఉండేది కేసీఆర్, నా ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు పర్యటన, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం, సీఎం సిరిసిల్ల టూర్ హైలెట్స్ ఇవే..

(The above story first appeared on LatestLY on Jul 04, 2021 08:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).