Telangana Shocker: 40 రోజుల పసికందును బండరాయితో కొట్టి దారుణంగా చంపేసిన తండ్రి, ఆడపిల్లగా పుట్టడమే ఆ చిన్నారి చేసిన పాపం, తెలంగాణ కాగజ్‌నగర్‌లో దారుణ ఘటన
తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని అప్పుడే భూమి మీదకు వచ్చిన పసికూనను కిరాతకంగా (Father killed 40 days baby Girl) హతమార్చాడు ఓ శాడిస్ట్ తండ్రి. ఆడపిల్లగా పుట్టినందుకు 40 రోజుల పసికందును బండరాయితో కొట్టి చంపేశాడు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ( Kagaznagar) మండలంలో దారుణం చోటు చేసుకుంది.
Kagaznagar, Nov 3: తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని అప్పుడే భూమి మీదకు వచ్చిన పసికూనను కిరాతకంగా (Father killed 40 days baby Girl) హతమార్చాడు ఓ శాడిస్ట్ తండ్రి. ఆడపిల్లగా పుట్టినందుకు 40 రోజుల పసికందును బండరాయితో కొట్టి చంపేశాడు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ( Kagaznagar) మండలంలో దారుణం చోటు చేసుకుంది.
స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్ మండలం మారేపల్లి పంచాయతీ లైన్‌గూడ గ్రామానికి చెందిన మెస్రం బాపురావు–మానస దంపతులు వ్యవసాయ పనులు చేస్తుంటారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. మూడో సంతానంలోనూ ఆడపిల్ల పుట్టింది. భారంగా భావించిన బాపురావు తాగిన మైకంలో సోమవారం అర్ధరాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 40 రోజుల పసికందును తల్లి పొత్తిళ్ల నుంచి తీసుకెళ్లి రోడ్డుపై పడేసి, బండతో మోది చంపేశాడు. భార్య వారిస్తున్నా వినకుండా ఈ దారుణానికి ఒడిగట్టాడు.
ఇంకా లోకం కూడా చూడని చిన్నారిని కిరాతకంగా హత్య చేశాడు. పక్కలోని బిడ్డను తీసుకెళ్లి తన కళ్లముందే చంపడంతో తల్లి కంటికి పుట్టెడుగా శోకిస్తోంది. కుటుంబ సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు. నిందితుడిని అదుపులోనికి తీసుకున్నట్లు కాగజ్‌నగర్ రూరల్ సీఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
(The above story first appeared on LatestLY on Nov 03, 2021 12:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

