Hyderabad Horror: చందానగర్‌లో దారుణం, భార్యను రోడ్డు మీద వెంబడించి కత్తితో నరికి చంపిన భర్త, అనుమానంతోనే హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారణ

హైదరాబాద్ నగరంలోని చందానగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను రాయితో అతి కిరాతకంగా కొట్టి హత్య చేశాడు ఓ కసాయి భర్త. ఈ ఘటన చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Hyderabad Horror: చందానగర్‌లో దారుణం, భార్యను రోడ్డు మీద వెంబడించి కత్తితో నరికి చంపిన భర్త, అనుమానంతోనే హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారణ
Murder (Photo Credits: Pixabay)

Hyd, April 14: హైదరాబాద్ నగరంలోని చందానగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను రాయితో అతి కిరాతకంగా కొట్టి హత్య చేశాడు ఓ కసాయి భర్త. ఈ ఘటన చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగండ్లలో నివాసముంటున్న తాండూరుకు చెందిన అంబికా.. బొటిక్ షాపులో పని చేస్తోంది.

యువకుడి ప్రైవేట్ పార్ట్ పట్టుకుని లాగేసిన పిట్‌బుల్ డాగ్, నొప్పితో విలవిలలాడిన బాధితుడు, పరిస్థితి విషమం

శుక్రవారం ఉదయం షాప్‌లో పనిచేస్తున్న సమయంలో ఆమె వద్దకు వచ్చిన భర్త నరేందర్.. తలపై బండరాయితో దాడి చేశాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి గాయాలతో రోడ్డుపై పరిగెత్తిన అంబికను వెంబడించి మరి అతి కిరాతకంగా కత్తితో హత్య చేశాడు. గొడవలు కారణంగా భార్యాభర్తలు ఏడాది నుంచి దూరంగా ఉంటున్నారు.. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణ అయ్యిందని పోలీసులు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Apr 14, 2023 02:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).