Sandhya Infra MD Sreedhar Rao: శ్రీధర్ రావు రెండు గంటల పాటు నన్ను దారుణంగా రేప్ చేశాడు, సంధ్య కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జిమ్ ట్రైనర్, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సనత్‌నగర్‌ పోలీసులు
Sexually Assault | Representational Image (Photo Credits: File Image)

Hyderabad, Nov 20: భవన నిర్మాణాల పేరుతో వినియోగదారులను మోసం చేసిన కేసులో నిందితుడుగా ఉన్న సంధ్య కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ ఎస్టేట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ సరనాల శ్రీధర్‌రావుపై (Sandhya Infra MD Sreedhar Rao) మరో కేసు నమోదైంది. శ్రీధర్‌రావు తనపై అత్యంత దారుణంగా అసహజరీతిలో లైంగిక దాడికి (Sridhar Rao booked for unnatural sex) పాల్పడినట్టు ఆయన జిమ్‌ ట్రైనర్, వ్యక్తిగత సహాయకుడు ఫిర్యాదు (bodyguard-cum-gym trainer lodges complaint) చేశాడు. ఈ మేరకు సనత్‌నగర్‌ పోలీసులు శుక్రవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

సనత్‌నగర్‌కు చెందిన సీహెచ్‌ చౌదరి స్థానిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి. నందగిరి హిల్స్‌లో ఉంటున్న సంధ్యా ఇన్ ఫ్రా ఎండీ శ్రీధర్‌రావు దగ్గర ఫిర్యదుదారు చౌదరి జిమ్‌ ట్రైనర్, వ్యక్తిగత సహాయకుడు, బాడీగార్డుగా పని చేస్తున్నాడు. వీరిద్దరూ అక్టోబర్‌ 10వ తేదీ రాత్రి బయటకు వెళ్లి 1.30 ప్రాంతంలో తిరిగి వచ్చారు. కాసేపటి తర్వాత సెకండ్‌ ఫ్లోర్‌లోని తన బెడ్‌ రూమ్‌కు రమ్మని చౌదరికి శ్రీధర్‌రావు చెప్పాడు.

వచ్చిన తరువాత నాకు వెన్నునొప్పిగా ఉందంటూ మసాజ్‌ చేయమని అడిగాడు. దీంతో చౌదరి కొంతసేపు మసాజ్‌ చేశాడు. ఆ సమయంలో శ్రీధర్‌రావు కొన్ని పిల్స్‌ వేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే చౌదరిని శ్రీధర్‌రావు బలవంతంగా దగ్గరకు లాక్కోవడం ప్రారంభించాడు. చౌదరి నెట్టివేసేందుకు ప్రయత్నించడంతో కత్తితో బెదిరించాడు. చౌదరి నిరాకరించడంతో కత్తితో చొక్కా సహా బట్టలన్నీ చింపేశాడు. ఎంత బతిమిలాడినా వినలేదు..: తాను వద్దంటూ వారిస్తున్నా, ఎంత బతిమిలాడినా వినిపించుకోకుండా శ్రీధర్‌రావు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని చౌదరి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ఆరోపించాడు.

అత్యాచారం చేస్తే ఇకపై అది అవుట్, జీవితాంతం సెక్స్‌కు పనికిరాకుండా రేపిస్టులకు కెమికల్‌ క్యాస్ట్రేషన్‌, క్రిమినల్‌ లా సవరణ బిల్లు 2021ను ఆమోదించిన పాకిస్తాన్ పార్లమెంట్

రెండు గంటల పాటు నరకం అనుభవించానని, విపరీతమైన రక్తస్రావం జరిగిందని తెలిపాడు. ఈ విషయం బయటకు చెíపితే చంపేస్తానని శ్రీధర్‌రావు బెదిరించినట్లు పేర్కొన్నాడు. తాను ఇన్నాళ్లూ భయపడ్డానని, ఇప్పుడతని మోసాలు బయటకు రావడంతో ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేస్తున్నానని చౌదరి పోలీసులకు తెలిపాడు. చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీధర్‌రావుపై సనత్‌నగర్‌ పోలీసులు.. అసహజ లైంగిక దాడి, బెదిరింపులకు సంబంధించి ఈ నెల 18న ఎఫ్‌ఐఆర్‌ (814/2021) నమోదు చేశారు.

చరిత్రలో తొలి కేసు..సెక్స్ చేస్తుండగా చీలిపోయిన పురుషాంగం, నిలువుగా చీలడంతో దూరమైన అంగస్తంభనలు, యూకేలో సర్జరీ తర్వాత కోలుకుంటున్న బాధితుడు, ఆరునెలల పాటు శృంగారానికి దూరంగా ఉండాలని వైద్యుల సూచన

కాగా, చీటింగ్‌ కేసులో గురువారం అరెస్టయిన శ్రీధర్‌రావుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలిత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అరెస్టు వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు.