Telangana COVID Report: నేటి నుంచి తెలంగాణలో రెండో ఫేజ్ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్, 60 ఏళ్లు పైబడిన వారికి టీకాల పంపిణీ, రాష్ట్రంలో గడిచిన ఒక్కరోజులో కొత్తగా మరో 116 పాజిటివ్ కేసులు నమోదు
టీకా పొందేందుకు అర్హులైన పౌరులందరూ తమ పేర్లను www.cowin.gov.in లో లేదా COWIN 2.0 యాప్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఆరోగ్య సేతు యాప్ ద్వారా టీకా వేసే తేదీ మరియు టైమ్ స్లాట్ గురించి తమ మొబైల్‌లో సందేశం పొందుతారు.....
Hyderabad, March 1: తెలంగాణలో సోమవారం నుంచి రెండవ ఫేస్ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం అవుతుంది. 60 ఏళ్లు పైబడిన పౌరులు మరియు దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడే 45 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సిన్ పొందేందుకు అర్హులు. టీకా పొందేందుకు అర్హులైన పౌరులందరూ తమ పేర్లను www.cowin.gov.in లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఆరోగ్య సేతు యాప్ ద్వారా టీకా వేసే తేదీ మరియు టైమ్ స్లాట్ గురించి తమ మొబైల్‌లో సందేశం పొందుతారు.
టీకాల పంపిణీ కోసం ప్రభుత్వం 45 ప్రభుత్వ మరియు 57 ప్రైవేట్ ఆసుపత్రిలలో ఏర్పాట్లు చేసింది. ప్రతి అసుపత్రిలో ఒకరోజుకు 200 డోసుల టీకాల పంపిణీకి అనుమతి ఉంది. ఎవరైనా నడవలేని స్థితిలో ఉంటే వారి ఇంటి వద్దకే వెళ్లి టీకా పంపిణీ చేయాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. టీకాలు వేసిన తర్వాత పేషెంట్లను అరగంట పాటు పరిశీలనలో ఉంచాలి.
ఇక రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కేసులను పరిశీలిస్తే, గత రాత్రి 8 గంటల వరకు 20,375 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 116 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 276 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,98,923కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 26 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 11, మరియు రంగారెడ్డి నుంచి 11 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 25 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో ఎలాంటి కోవిడ్ మరణాలు నమోదు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,634గా ఉంది. మరోవైపు ఆదివారం సాయంత్రం వరకు మరో 165 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,95,387 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1902 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Mar 01, 2021 09:57 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

