Telangana: కుటుంబ కలహాలు, చిన్నారికి ఉరివేసి తరువాత ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులు, హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన
హబ్సిగూడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హబ్సిగూడ అపార్ట్‌మెంట్‌లో (Hyderabad’s Habsiguda) ఉంటున్న ఒక కుటుంబంలోని నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు (Four of a family found dead) పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Hyd, Jan 16: హబ్సిగూడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హబ్సిగూడ అపార్ట్‌మెంట్‌లో (Hyderabad’s Habsiguda) ఉంటున్న ఒక కుటుంబంలోని నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు (Four of a family found dead) పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతి చెందిన వారిలో దంపతులు, నాలుగేళ్ల బాలిక సహా మరో మహిళ కూడా ఉన్నారు. మృతులు ప్రతాప్(34), సింధూర(32), ఆద్య(4), ప్రతాప్ తల్లిగా గుర్తించారు.
తొలుత నాలుగేళ్ల చిన్నారి ఆద్యకు ఉరివేసి ఆపై కుటుంబం అంతా ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని కార్ షోరూమ్‌లో ప్రతాప్ డిజైనర్ మేనేజర్‌గా పని చేస్తుండగా, హిమయత్‌నగర్‌లో ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్‌గా సింధూర పని చేస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
(The above story first appeared on LatestLY on Jan 16, 2023 06:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

